నేటితో ముగియనున్న నాగ చైతన్య కొత్త మూవీ ఫస్ట్ షెడ్యూల్

నేటితో ముగియనున్న నాగ చైతన్య కొత్త మూవీ ఫస్ట్ షెడ్యూల్

Published on Dec 24, 2013 12:30 PM IST

naga-chaitanya
ప్రస్తుతం నాగ చైతన్య ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ఫేం విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. నేటితో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ముగియనుంది. అలాగే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ జనవరిలో మొదలు కానుంది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సొంత బ్యానర్ లో చేస్తున్న సినిమా కావడం వల్ల నాగ చైతన్య ఈ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ సినిమా కాకుండా నాగ చైతన్య నటించిన ‘ఆటోనగర్ సూర్య’ త్వరలో విడుదల కానుంది. అలాగే అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంతా కలిసి చేస్తున్న ‘మనం’ సినిమా కూడా మార్చిలో విడుదల కానుంది.

తాజా వార్తలు