నా 150వ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది : చిరంజీవి

నా 150వ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది : చిరంజీవి

Published on Aug 22, 2012 8:28 AM IST


మొగల్తూరులో కొణిదెల శివ శంకర ప్రసాద్ గా పుట్టి మెగాస్టార్ గా ఎదిగిన చిరజీవి గారి పుట్టినరోజు ఈ రోజు. ఆయన అభిమానులకి ఈ రోజు పండుగ రోజు. 1955 ఆగష్టు 22న కొణిదెల వెంకటేశ్వర రావు కుటుంబంలో జన్మించిన చిరంజీవి 1978లో ‘పునాది రాళ్లు’ సినిమాతో నటుడిగా రంగప్రవేశం చేసారు. ఆ తరువాత హీరోగా సినిమాలు చేస్తూ 1990 లలో వచ్చిన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని మెగాస్టార్ గా ఎదిగారు. శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత ఆయన సినిమాలకి గ్యాప్ ఇచ్చి 2008లో ప్రజా రాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు.

ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ దిన పత్రికతో తన 150వ సినిమా గురించి మాట్లాడుతూ ‘నా 150వ సినిమా గురించి నా అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను కూడా అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా ఎంతో ప్రత్యేకం, అందుకే మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నాను. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండ చేస్తాను’. చరణ్ నటించిన’రచ్చ’, పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’, అల్లు అర్జున్ నటించిన ‘జులాయి’ పెద్ద హిట్స్ గా నిలవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేసారు.

123తెలుగు.కాం తరపున చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

తాజా వార్తలు