అక్కడ కమల్ సినిమాకి 15 కోట్లు లాస్?

అక్కడ కమల్ సినిమాకి 15 కోట్లు లాస్?

Published on Jun 4, 2025 7:04 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా త్రిష, అభిరామి ఫీమేల్ లీడ్ లో దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమానే థగ్ లైఫ్. అయితే ఈ సినిమా గ్రాండ్ గా రేపు విడుదల కానుండగా ఈ మధ్యలో పలు షాకింగ్ కాంట్రవర్సీలు కూడా తప్పలేదు. ముఖ్యంగా కన్నడ రిలీజ్ విషయంలో ఉద్రిక్తత నెలకొంది. కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడ రిలీజ్ కి అడ్డుకట్ట వేసాయి.

అయితే కన్నడ లో బ్యాన్ అయ్యిన ఈ సినిమాకి అక్కడ విడుదల కాకపోవడం మూలాన 15 కోట్లు నష్టం వచ్చినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఒక వారం తర్వాత అక్కడ రిలీజ్ ఉంటుంది అని టాక్ కూడా వచ్చింది కానీ అదేమీ సాధ్యం అయ్యే పరిస్థితి కూడా లేదట. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు అలాగే కమల్, ఆర్ మహేంద్రన్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు