పూర్తయిన 1 చిత్రీకరణ

_completed
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “1- నేనొక్కడినే” సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా బృందం గుమ్మడికాయ కొట్టి లాంఛనాన్ని ముగించేసారు. ఈరోజు ఉదయం 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసింది

అంతేకాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే రెండు వారాలలో ఈ సినిమా ప్రచారంపై దృష్టి సారించనున్నారు. భారీ అంచనాల నడుమ విడుదలైన టీజర్లు ప్రేక్షకాదరణ పొందాయి. అందరూ ఎప్పుడుప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేవారం విడుదలకానుంది. ఈ థ్రిల్లర్ లో మహేష్ సరసన కృతిసనన్ నటిస్తుంది. మహేష్ రాక్ స్టార్ పాత్ర పోషిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 10న విడుదలకానుంది

Exit mobile version