విక్రమ్ సినిమాకి 8 మంది మ్యూజిక్ డైరెక్టర్స్


విక్రమ్, జీవా కాంబినేషన్లో త్వరలో ‘డేవిడ్’ సినిమా అనే తెరకెక్కనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా గురించి రోజుకో వెరైటీ వార్త వస్తుంది. విక్రమ్ మరియు జీవా ఇద్దరు డేవిడ్ అనే పాత్రలు పోషిస్తుండగా ఈ సినిమాకి రత్నవేలు, శ్రీజల్ షా ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు పనిచేయనున్నారు. విక్రమ్ పాత్రకి సంభందించిన సన్నివేశాల్ని రత్నవేలు చిత్రీకరించనుండగా, జీవాకి సంభందించిన సన్నివేశాల్ని శ్రీజల్ షా చిత్రీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి 8 మంది మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయబోతున్నారు. ప్రస్తుతానికి ప్రశాంత్ పిళ్ళై, అనిరుద్ రవిచందర్, రెమో, మోడరన్ మాఫియా వీరిని మ్యూజిక్ డైరెక్టర్స్ గా ధ్రువీకరించారు. డేవిడ్ సినిమాలో లారా దత్త, టబు, ఇషా శర్వాణి హీరోయిన్లుగా నటించబోతున్నారు.

Exit mobile version