లోకేషన్స్ వేటలో హరీష్ శంకర్

లోకేషన్స్ వేటలో హరీష్ శంకర్

Published on Jan 31, 2013 3:12 PM IST

Harish-Shanker

డైరెక్టర్ హారీష్ శంకర్ – యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. ప్రస్తుతం హరీష్ శంకర్ తన సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలితో కలిసి లోకేషన్స్ వేటలో ఉన్నాడు. ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ని పవర్ఫుల్ కాలేజ్ స్టూడెంట్ గా చూపించనున్నామని హరీష్ శంకర్ ఇదివరకే తెలిపాడు. ఇలాంటి పాత్రని ఎన్.టి.ఆర్ ఇదివరకు చేయలేదు. మాస్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ కి మంచి పేరుంది, అలాగే ఎ.టి.ఆర్ డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కావున ఈ సినిమాలో అదిరిపోయే డైలాగ్స్ ఉంటాయని ఆశించవచ్చు.

తాజా వార్తలు