పి సునీల్ కుమార్ రెడ్డి తాజా సినిమా ‘నేనేం.. చిన్న పిల్లనా?’ సినిమాకు కొత్త ఆకర్షణ తోడయ్యింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రకోసం దర్శకుడు సంజనను సంప్రదించాడు. రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో తన్వి వ్యాస్ హీరొయిన్ గా తెలుగు తెరకు పరిచయంకానుంది. ఎన్.ఆర్.ఐ పాత్ర పోషించబోతున్న సంజన ఈ సినిమా షూటింగ్లో ఈ నెల చివరనుండి పాల్గోనుంది. “నేను ఈ సినిమాలో రెండో హీరొయిన్ పాత్ర చేయడంలేదు. తన్వి పాత్ర ఎంత ముఖ్యమో ఈ సినిమాలో నా పాత్రకుడా అంతే ముఖ్యమని”ఆమె ఒక పత్రికకు తెలిపింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పల్లె నుండి పట్నం వచ్చిన ఒక యువతి చుట్టూ తిరిగే కధ. ఎం.ఎం శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు.