నవంబర్ 8 న విడుదలకానున్న కోటి కుమారుని సినిమా

Chinni_Chinni_Aasa
సంగీత దర్శకుడు కోటి కుమారుడైన రాజీవ్ ‘నోట్ బుక్’ సినిమా ద్వారా పరిచయమైనా ఇంకా విజయపు రుచి చూడలేదు. ఇప్పుడు రాజీవ్ ‘చిన్ని చిన్ని ఆశ’ అనే సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించానున్నాడు

ఈ సినిమా నవంబర్ 8 న మనముందుకు రానుంది. ఇప్పటివరకూ పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన ధన్యా బాలకృష్ణన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. అపార్ట్మెంట్ నేపధ్యంలో సాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వుండనుంది. శ్రీనివాస్ రావు, అజయ్ ముఖ్య పాత్రలు పోషించారు

డా కిరణ్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. కార్తీక్ స్వరాలను అందించాడు. సూపర్ సినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గారిమేళ్ళ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు

Exit mobile version