మరోసారి అరెస్టైన రవితేజ తమ్ముడు

మరోసారి అరెస్టైన రవితేజ తమ్ముడు

Published on Mar 4, 2014 11:00 AM IST

bharath
హీరో రవితేజ తమ్ముడు భరత్ మరోసారి సమస్యలో ఇరుక్కున్నాడు. నటుడు భరత్ ను ఈ రోజు ఉదయం మాదాపూర్ దగ్గరలోని హైటెక్ సిటీ ఏరియాలో తాగి కారు నడుపుతున్న కారణంగా అరెస్ట్ చేసారు. మంగళవారం ఉదయం రెగ్యులర్ చెకప్ కోసమని ఈ నటుడి వెహికల్ ని ఆపారు.

పోలీసులు భరత్ ని ప్రశ్నిస్తే.. ఆ ఆఫీసర్స్ తో భరత్ చాలా చెడుగా బిహేవ్ చెయ్యడం అలాగే భూతు మాటలను వాడడంతో సీరియస్ అయిన ఆఫీసర్స్ భరత్ ని అరెస్ట్ చేసారు. వాళ్ళు ఈ రోజు భరత్ ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. భరత్, అతని బ్రదర్ రఘుని గత నాలుగు సంవత్సరాల క్రితం డ్రగ్ రాకెట్ కేసులో అరెస్ట్ చేసారు.

తాజా వార్తలు