ఉదయ కిరణ్ అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకున్న తరువాత సినీ ప్రముఖులంతా ఉదయ్ ఎంతో మంచివాడంటూ కొనియాడారు. ఇండస్ట్రీలోనే అత్యంత మృదుస్వభావి, దయా హృదయుడు అంటూ చెప్పుకొచ్చారు
కెరీర్ మొదట్లో వరుసపెట్టి విజయాలు చూసినా క్రమంగా విజయాలు అన్న పదమే దూరమయింది. 2013 ఏప్రిల్ లో విడుదలైన జై శ్రీరామ్ సినిమా అతని ఆఖరి చిత్రం. ఇప్పుడు అతను నటించి విడుదలకానీ ‘చిత్రం చెప్పిన కధ’ సినిమాను మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు
ఈ సినిమాకు సంబంధించి మొదటి టీజర్ ఇటీవలే విడుదల చేసారు. సినిమా గురించి ఎక్కువ వివరాలు తెలుపకపోయినా ఈ సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్ కానుందని తెలుస్తుంది. మోహన్ దర్శకుడు. మున్నా నిర్మాత. మున్నా కాశి సంగీత దర్శకుడు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతాం