ఫోర్ట్ గ్రాండ్ లో వినాయక్ – సమంతల మూవీ షూటింగ్

ఫోర్ట్ గ్రాండ్ లో వినాయక్ – సమంతల మూవీ షూటింగ్

Published on Mar 3, 2014 4:45 PM IST

samantha-vinayak
హైదరాబాద్ లో పసిద్ది గాంచిన, అలాగే పర్యాటకులను ఆకట్టుకునే పురాతన కట్టడాల్లో ఫోర్ట్ గ్రాండ్ కూడా ఒకటి. దీని గురించి ఎందుకు చెప్పానంటే ప్రస్తుతం ఇక్కడే మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సమంత హీరోయిన్ గా నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ లొకేషన్ లో శ్రీనివాస్ – సమంతలపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు.

నిన్ననే యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమా ‘రభస’ కోసం సాంగ్ షూట్ ఫినిష్ చేసుకున్న సమంత ఈ రోజు నుండి వివి వినాయక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ రెండు సినిమాలను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు