6 భాషల్లో రానున్న రజినీ ‘కొచ్చాడియాన్’

6 భాషల్లో రానున్న రజినీ ‘కొచ్చాడియాన్’

Published on Mar 3, 2014 2:00 PM IST

kochadaiyaan-Poster
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన 3డి గ్రాఫికల్ మానియా ‘కొచ్చాడియాన్’ భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ‘కొచ్చాడియాన్’ తమిళ్, తెలుగు, హిందీ, పంజాబ్, భోజ్ పురీ, మరాఠీ భాషల్లో అనగా 6 భాషల్లో రిలీజ్ కానుంది. ‘కొచ్చాడియాన్’ సినిమా తెలుగులో ‘విక్రమ సింహా’గా రానుంది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఆడియో ఈ నెల 9న తమిళ్ లో, 10న తెలుగులో విడుదల కానుంది. దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, శోభన తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు