‘యుద్ధం’పై ఆశలు పెట్టుకున్న తరుణ్

‘యుద్ధం’పై ఆశలు పెట్టుకున్న తరుణ్

Published on Mar 3, 2014 11:00 AM IST

tarun
గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న లవర్ బాయ్ తరుణ్ ఈవారం ‘యుద్ధం’ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. యామి గౌతం హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి చక్రి సంగీతం అందించాడు. ఈ మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు.

చాలా రోజుల నుంచి విజయాలు లేక డీలా పడిపోయిన తరుణ్ ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకొంటుందని మళ్ళీ తనకి ఆఫర్స్ వస్తాయని ఆశలు పెట్టుకున్నాడు. భారతి గణేష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నట్ట కుమార్ నిర్మించాడు.

యామి గౌతం గ్లామర్ ఈ సినిమాని పెద్ద హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇటీవలే పలువురు ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసారు.

తాజా వార్తలు