ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యాంపులో కొన్ని విషయాలపై జోరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్ననే పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వచ్చాయి. అలాగే మేము ఆరా తీసిన దాని ప్రకారం ఆయనకొట్ట పార్టీ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. అదే సమయంలోనే నిన్న పవన్ కళ్యాణ్ ఆఫీసు నుండి ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు.
అందులో చిరంజీవికి – పవన్ కి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవని ఖరారు చేసినా పవన్ రాజకీయ ఎంట్రీ పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మార్చి రెండవ వారమో ప్రెస్ మీట్ పెట్టి చెబుతాననడంతో ఇప్పుడు అందరి చూపు మార్చి రెండవ వారం పైనే ఉంది.
మే లో ఎలక్షన్స్ జరగనున్నాయి, అలాగే మే చివరి వరకు పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొనడం లేదు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ఆయన తన రాజకీయ ఎంట్రీ పై వస్తున్న వార్తలను కొట్టిపారేసే అవకాశం కనిపించడం లేదు.
ప్రస్తుతం అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒక్కటే.. పవన్ నిజంగానే కొత్త పార్టీ లాంచ్ చేస్తారా? లేక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేక ఇప్పటికే ఉన్న ఏదన్నా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? అన్నది? తెలియాలంటే మార్చి రెండవ వారం వరకూ ఎదురు చూడాలి..