రాజకీయ ప్రవేశంపై క్లారిఫై చేయనున్న పవన్ కళ్యాణ్

రాజకీయ ప్రవేశంపై క్లారిఫై చేయనున్న పవన్ కళ్యాణ్

Published on Mar 2, 2014 9:30 PM IST

pawan-kalyan
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత కొన్ని రోజులుగా ఆయన చేయబోయే సినిమాల కంటే ఆయన త్వరలో రాజకీయాల్లోకి రానున్నాడని, అలాగే తన అన్నయ్య చిరంజీవితో సంబందాలు పెద్దగా బాలేవని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాల పై పవన్ కళ్యాణ్ ఆఫీసు నుండి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసారు.

ఆ ప్రెస్ నోట్ లో ‘ చిరంజీవి గారికి – పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. అలాగే పవన్ కళ్యాన్ రాజకీయాల్లోకి వస్తారని, కొత్త పార్టీ పెడతారని వస్తున్నా వార్తలపై పవన్ కళ్యాణ్ గారే మార్చి రెండవ వారంలో ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ చేస్తారని’ తెలిపారు. దేన్నీ బట్టి కొంతమంది తన కొత్త పార్టీ గురించి, రాజకీయ ప్రవేశం గురించి చెబుతాడని అంటుంటే కొంతమంది ఏమో ఆ వార్తలని కొట్టి పారేయడానికి పెడుతున్నారని అంటున్నారు.అసలు ఏం జరుగుతుంది అనేది తెలియాలేంటే మరో రెండు వారాలు ఎదురు చూడాల్సిందే..

తాజా వార్తలు