రేసు గుర్రం టైటిల్ ట్రాక్ పాడిన ఉష ఉతుప్

రేసు గుర్రం టైటిల్ ట్రాక్ పాడిన ఉష ఉతుప్

Published on Mar 2, 2014 10:30 PM IST

usha_uthup
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసు గుర్రం’ సినిమా త్వరలో భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం సాంగ్ రికార్డింగ్స కూడా జరుగుతున్నాయి. ఈ మూవీ టైటిల్ సాంగ్ పాడడానికి ఫేమస్ సింగర్ ఉష ఉతుప్ ని సెలెక్ట్ చేసారు. ఫుల్ మాస్ సాంగ్ గా ఉండనున్న ఈ పాటలో అల్లు అర్జున్ మంచి జోష్ ఫుల్ స్టెప్స్ వేస్తాడని ఆశించవచ్చు. ఈ మాస్ పాటకి ఉష ఉతుప్ వాయిస్ పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని ఆశిస్తున్నారు.

థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మాస్ యాక్సహ్న్ ఎంటర్ టైనర్ ని నల్లమపు బుజ్జి నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు