‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’ సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయిన హరీష్ శంకర్ తను తీసిన చివరి సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’ పరాజయం పాలవడంతో ఈ సారి చేయబోయే స్క్రిప్ట్ పై బాగానే కసరత్తులు చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ తన తదుపరి సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ ని హీరోగా ఎంచుకున్నాడు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న ‘రేయ్’ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మూవీ రిలీజ్ ఆలస్యం అవుతుండడంతో సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాని స్టార్ట్ చేసి పూర్తి చేసే దశలో ఉన్నాడు. అది పూర్తి కాకముందే హరీష్ శంకర్ తో మరో సినిమాకి సైన్ చేసాడు. హరీష్ శంకర్ – సాయి ధరమ్ తేజ్ మూవీని పరుచూరి ప్రసాద్ నిర్మించనున్నారు.