మస్కట్ లో ఇషా చావ్లాతో చిందేయనున్న అల్లరోడు

మస్కట్ లో ఇషా చావ్లాతో చిందేయనున్న అల్లరోడు

Published on Mar 2, 2014 1:30 PM IST

Allari-Naresh-to-romance-Is
కామెడీ కింగ్ అల్లరి నరేష్ – ఇషా చావ్లా జంటగా ఇ. సత్తిబాబు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ‘జంప్ జిలాని’ అనే టైటిల్ పెట్టిన ఈ సినిమా తమిళ సినిమా కలకలప్పు సినిమాకి రీమేక్. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి అంబిక రాజ నిర్మిస్తున్నారు.

అల్లరి నరేష్ తన కెరీర్ లో మొదటి సారిగా ఈ సినిమా కోసం ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా వరకు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర టీం రెండు పాటలను షూట్ చేయడానికి మస్కట్ వెళ్ళింది. విజయ్ ఎబెనెజెర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని గోదావరి జిల్లాల్లో షూట్ చేసారు.

ఇది కాకుండా అల్లరి నరేష్ – రవిబాబు కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లడ్డూ బాబు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే త్వరలో చిన్ని కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో కార్తీక, మోనాల్ గజ్జర్ హీరోయిన్స్ గా నటించనున్నారు.

తాజా వార్తలు