గచ్చిబౌలి లో వున్న ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ కంపనీలో ఒక వేడుకకు ముఖ్య అతిధిగా హాజరుకానున్నాడు. ఈ ఈవెంట్ మార్చ్ 8న మహిళా దినోత్సవ సందర్భంగా జరగనుంది. విశేషమేమిటంటే మహేష్ మహిళల అత్యాచారాలను నియంత్రించేందుకు రూపొందించిన ‘మర్ద్’ ప్రోగ్రాం లో భాగస్వామి కూడా
ప్రస్తుతం బళ్ళారిలో ఆగడు షూటింగ్ లో బిజీగా వున్నాడు. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమాలో మహేష్ పోలీస్ గా నటించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకుడు. ప్రకాష్ రాజ్. బ్రహ్మానందం ముఖ్య పాత్రధారులు
థమన్ సంగీత దర్శకుడు. అనీల్ సుంకర, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఈ సినిమాను 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా నిర్మితమవుతుంది. ఈ ఏడాదిలో ఈ సినిమా మనముందుకురానుంది.