ఐటెం సాంగ్ లకు దూరమంటున్న లక్ష్మీ రాయ్

ఐటెం సాంగ్ లకు దూరమంటున్న లక్ష్మీ రాయ్

Published on Mar 1, 2014 6:20 PM IST

Lakshmi-Rai

బలుపు సినిమాలో తళుక్కున మెరిసిన లక్ష్మిరాయ్ ఇకపై నుండి ఐటెం సాంగ్ లలో నటించనని స్పష్టం చేసింది. ఆమెకు ప్రస్తుతం తమిళ, మళయాళ సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తనకు సినిమాలంటే పిచ్చి కనుకే నటిస్తున్నా అని చెప్పింది

మరి బలుపు సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఎందుకు నటించారు అని అడిగితే “ముందుగా నేను ఈ ఆఫర్ పై అంత ఆసక్తి చూపించలేదు. కానీ గోపీచంద్ మలినేని నాకో ప్రత్యేక పాత్ర ఇచ్చాడు. అందులోనూ ఈ పాట మొదటి పదం లక్కీ రాయ్ నాకు చాలా నచ్చింది. ఇటువంటి స్పెషల్ సాంగ్స్ చేయడంలో నాకు అభ్యంతరం లేదు. నేను ఐటెం సాంగ్స్ మాత్రం చెయ్యను” అని తెలిపింది

ఇష్కియా సినిమా తమిళ రిమేక్ లో ఈ భామను విద్యాబాలన్ పాత్ర పోషించమన్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆర్య, మోహన్ లాల్ ప్రధానపాత్రధారులు. ఈమె చేతిలో మరికొన్ని తమిళ సినిమాలు కూడా వున్నాయి. అంతేకాక కోడిరామకృష్ణ రాణియమ్మ సినిమాకు కూడా సంతకం చేసింది

తాజా వార్తలు