నేటితో పూర్తి కానున్న ‘లెజెండ్’ టాకీ పార్ట్

నేటితో పూర్తి కానున్న ‘లెజెండ్’ టాకీ పార్ట్

Published on Feb 28, 2014 1:02 PM IST

legend1
నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెజెండ్’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం మిగిలి ఉన్న పాచ్ వర్క్ సీన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నారు. జగపతి బాబు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ పాచ్ వర్క్ సీన్స్ నేటితో ముగియనున్నాయి. దాంతో ఈ మూవీ టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఇక మిగిలి ఉన్న ఒకే ఒక సాంగ్ త్వరలోనే షూట్ చేయనున్నారు.

ఇటీవలే ఈ సినిమాలోని రెండు పాటలని, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని దుబాయ్ లో షూట్ చేసారు. బాలకృష్ణ ఈ మూవీకి డబ్బింగ్ చెప్పడం కూడా మొదలు పెట్టారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాధికా ఆప్టే, సోనాల్ చోహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో మార్చి 7న విడుదల కానుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు