ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘లెజెండ్’ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు. జగపతి బాబు ఇండస్ట్రీకి వచ్చి రేపటితో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నాడు. ఈ సందర్భంగా లెజెండ్ ప్రొడక్షన్ టీం ఈ సినిమాలో జగపతి బాబు లుక్ కి సంబందించిన ఓ స్పెషల్ ఫోటోని రిలీజ్ చేయనున్నారు.
బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలకృష్ణ మార్క్ పంచ్ డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ తో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ – వారాహి చలన చిత్రం వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.