సూపర్ స్టార్ మహేష్ కుమారుడు ప్రిన్స్ గౌతమ్ నిన్న విడుదలైన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెరారంగ్రేటమ్ చేశాడు. ఈ చిచ్చరుపిడుగు స్క్రీన్ పై నటించిన తీరుతో మహేష్ అభిమానులు ఆనందంగా వున్నారు. కెమెరా అంటే ఏ మాత్రం భయం, బెణుకు లేకుండా గౌతమ్ మనల్ని ఆశ్చర్యపరిచాడు
చాలా ఇంటర్వ్యూలలో గౌతమ్ కి స్వతహాగా నటించడం అన్న కళ వుందని సుకుమార్ తెలిపాడు. ఈ సినిమాలో మహేష్ చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషించాడు. ప్రస్తుతం గౌతమ్ కు 7 సంవత్సరాలు
ఎలాగో స్క్రీన్ పై కనిపించేశాడు కాబట్టి ఘటమ్మనేని కుటుంబ అభిమానులు తరువాత తరం నటులగురించి కూడా ఆలోచించేసుకోవచ్చు