‘1’ ఏ సినిమాకి కాపీ కాదు – సుకుమార్

‘1’ ఏ సినిమాకి కాపీ కాదు – సుకుమార్

Published on Jan 9, 2014 12:00 PM IST

Sukumar-Latest-Stills-(6)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్టైలిష్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘1-నేనొక్కడినే’ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మహేష్ బాబు రాక్ స్టార్ గా కనిపించనున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. ఈ సినిమా విడుదల సందర్భంగా సుకుమార్ మీడియాతో ముచ్చటించారు.

‘చాలా రోజుల నుంచి ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి స్పూర్తిగా తీసుకొని చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏమిటని సుకుమార్ ని అడిగితే ‘ అలాంటిది ఏమీ లేదండి. 1 సినిమా ఏ సినిమాకి కాపీ కాదు. నా దగ్గర, నా సహాయక దర్శకుల దగ్గర కావలసినన్ని కొత్త కథలు ఉన్నాయి. నేను తీసిన 1 లో ఏదైనా సీన్ లో గానీ లేదా ఏదైనా షాట్ లో గానీ నాకు తెలియకుండానే హాలీవుడ్ సినిమాల ప్రభావం పడి ఉంటే ఉండొచ్చు గానీ దేనికి స్ఫూర్తి మాత్రం కాదని’ అన్నాడు.

కృతి సనన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.

తాజా వార్తలు