ఎంటర్టైన్మెంట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్న ఎవడు టీం

ఎంటర్టైన్మెంట్ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్న ఎవడు టీం

Published on Jan 8, 2014 8:42 PM IST

yevadu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎవడు’ సినిమా జనవరి 12న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఈ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంటున్నారు. అలాగే ఆ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చడమే కాకుండా సినిమాకి హెల్ప్ అవుతుందని ఈ చిత్ర టీం అంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీని దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు