బాలకృష్ణ కోసం సింహాచలం సెట్

బాలకృష్ణ కోసం సింహాచలం సెట్

Published on Jan 7, 2014 6:05 PM IST

Legend_First_Look1
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘లెజెండ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. హైటెక్ సిటీ ఇనార్బిట్ మాల్ కి దగ్గరలో ప్రత్యేకంగా సింహాచలం సెట్ ని వేసారు. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ మూవీలో బాలకృష్ణకి సమ ఉజ్జీ అయిన విలన్ పాత్రలో జగపతి బాబు కనిపించనున్నాడు.

‘లెజెండ్’ సినిమాని వారాహి చలన చిత్రం – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్టర్. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. దానికి అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజా వార్తలు