శృతి హాసన్ కొద్ది రోజుల క్రితం కడుపు నొప్పితో అపోలో హాస్పిటల్ లో చేరింది. డాక్టర్స్ అది అపెండిక్స్ అని ఖరారు చేసి ఆపరేషన్ చేసేసారు. ప్రస్తుతం తను బాగుంది. శృతి ఈ రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యింది. అలాగే ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు థాంక్స్ చెప్పింది. ‘హలో నా మీద ఇంత ప్రేమ మరియు నేను త్వరగా కోలుకోవాలని విష్ చేసిన అందరికీ థాంక్స్.. అపెండిక్స్ పోయింది, ఇక నిదానంగా ముందుకు వెళ్ళాలని’ ట్వీట్స్ చేసింది.
శృతి హాసన్ రామ్ చరణ్ కి జోడీగా నటించిన ‘ఎవడు’ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కాకుండా అల్లు అర్జున్ సరసన ‘రేసు గుర్రం’ సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది.