ఆ రెండు తప్ప మరొకటి తెలియదు – ఎఆర్ రెహమాన్

ఆ రెండు తప్ప మరొకటి తెలియదు – ఎఆర్ రెహమాన్

Published on Jan 6, 2014 1:42 PM IST

ar-rehman

ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కావాలనుకొని మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన ఎఆర్ రెహమాన్ ప్రపంచ స్థాయిలో కీర్తి గడించడమే కాకుండా సినీ రంగంలోని వారు ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ కి మ్యూజిక్ అందించిన ఎఆర్ రెహమాన్ పుట్టిన రోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రెహమాన్ తనకి తెలిసినవి రెండే రండని అంటున్నాడు. అవేంటో ఆయన మాటల్లోనే..

‘నాకు సంగీతం, దేవుడు తప్ప మరొకటి తెలియదు. నేనీ స్థాయిలో ఉండటానికి కారణం దేవుడే. అందుకే స్టార్డం అనేది నాలో ఎలాంటి మార్పు తీసుకురాలేదు. డబ్బులు, ఫేం అనేవి వస్తాయి పోతాయి.. అందుకే నేను వాటికి ప్రాధాన్యం ఇవ్వను. సక్సెస్ అవ్వడానికి టాలెంట్ ఒక్కటే కాదు, వినయంగా కూడా ఉండాలి. నేను ప్రతిసారి ఓ పాట కంపోజ్ చేయబోయే ముందు.. ఇక అయిపొయింది నా పని అనుకుంటా.. దేవుడి ముందు ఓ బిక్షగాడిలా గిన్నె పట్టుకొని ఆ గిన్నెలో సరైన ఆలోచనలు ఇవ్వు అని వేడుకుంటాను. ప్రతిసారి దేవుడు నా పై దయ చూపిస్తున్నాడని’ అన్నాడు.

ఎఆర్ రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

తాజా వార్తలు