అల్లు అర్జున్ సినిమాకి దర్శకత్వం వహిస్తా – మారుతి

అల్లు అర్జున్ సినిమాకి దర్శకత్వం వహిస్తా – మారుతి

Published on Jan 5, 2014 5:00 PM IST

Allu-Arjun-and-Maruthi
‘ఈ రోజుల్లో’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు డైరెక్టర్ గా పరిచయమైన మారుతి అనతి కాలంలోనే ఇండస్ట్రీలో చర్చించుకునే టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయాడు. మొదటి సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన ‘బస్ స్టాప్’, ఆ తర్వాత దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ‘ప్రేమకథా చిత్రమ్’ మంచి విజయాన్ని అందుకున్నాయి.

ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలోత్వరలోనే అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేస్తానని అన్నాడు. ‘నాకు అల్లు అర్జున్ 10 సంవత్సరాల నుంచి తెలుసు. నా సినిమాలన్నిటినీ అతను మొదటి రోజు చూస్తాడు. ఆ తర్వాత నన్ను పిలిచి సినిమా గురించి మాట్లాడతాడు. ఎప్పుడు నా కామెడీ టైమింగ్ బాగుంటుందని ఎప్పుడు చెప్తూ ఉంటాడు. త్వరలోనే మా ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్తున్నానని’ మారుతి అన్నాడు.

ప్రస్తుతం మారుతి ‘కొత్త జంట’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అల్లు శిరీష్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు