ప్రస్తుతం మీడియాలో బాగా పాపులర్ గా వినిపిస్తున్న పుకారు దర్శకుడు సురేష్ కృష్ణ భాషా 2 ని తెరకెక్కించనున్నాడని. కానీ దీన్ని ఆ దర్శకుడు కొట్టి పారేశాడు. “ఇటువంటి పుకార్లు ఎక్కడనుండి వస్తాయో నాకు తెలీదు. కొన్నేళ్ళక్రితం ఈ సినిమాపై పుస్తకం రాసినప్పుడు దీనికి సీక్వెల్ ప్రసక్తే లేదని రాశాను. నాకు భాషా 2పై ఎటువంటి ఆలోచనలు లేవని”తెలిపాడు
వాస్తవానికి రజిని కెరీర్ లోనే భాషా సూపర్ హిట్. ఇక్కడ అతనికంత అభిమాన గణాన్ని సంపాదించిపెట్టింది కూడా ఆ సినిమానే. గత 2దశాబ్దాలుగా ఈ సినిమా స్క్రీన్ ప్లే ను ఆధారం చేసుకుని కొన్ని వందల తెలుగు సినిమాలు తయారయ్యాయి. ప్రస్తుతం సురేష్ కృష్ణ ఒక తమిళ సీరియల్ తీస్తున్నాడు. దీని తరువాత తెలుగు, తమిళ భాషలలొ ఒక ద్విభాషాచిత్రాన్ని తీయనున్నాడు
మరోపక్క రజిని కొచ్చాడయాన్ సినిమాపనిలో బిజీగా వున్నాడు. తన తదుపరి సినిమాపై పలు వార్తలు వస్తున్నా ఇంకా ఏ చిత్రాన్నీ అధికారికంగా ధృవీకరించలేదు