ఏప్రిల్ 14న మనోహరుడు?

ఏప్రిల్ 14న మనోహరుడు?

Published on Jan 4, 2014 4:59 PM IST

Shankar
డైనమిక్ డైరెక్టర్ శంకర్ తాజా చిత్రం షూటింగ్ చివరిదశలో వుంది. ఈ సినిమాలో విక్రమ్, అమీ జాక్సన్ లు హీరో, హీరొయిన్స్. వేషధారణ, విజువల్ ఎఫెక్ట్స్ చిత్రీకరణ నేపధ్యంలో పలుమార్లు వార్తలలోకెక్కిన ఈ సినిమాలో కుడా శంకర్ తన మార్కు మ్యాజిక్ ను చుపించానున్నాడు. పూర్తి కధ తెలియకపోయినా ఈ సినిమాలో విక్రమ్ ది ద్విపాత్రాభినయమట

ప్రస్తుతం చెన్నైలో ఒక పాట చిత్రీకరణ జరుపుకుంటున్నారు. ఇప్పటికే హీరొయిన్ పాత్ర షూటింగ్ పూర్తిచేసుకున్న బృందం హీరోకు సంబంధించిన సన్నివేశాలను జనవరి మధ్యలో పుర్తిచేయ్యనున్నారు. చెన్నై, కోడైకనాల్, చైనాలో సుందర ప్రదేశాలలో షూటింగ్ జరిపారు

ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాత. ఈ సినిమాను తమిళ కొత్త సంవత్సరమైన ఏప్రిల్ 14న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏ.ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. పి.సి శ్రీరాం సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు