1 తో యుట్యూబ్ లో కొత్త రికార్డును సృష్టించిన మహేష్ బాబు

1 తో యుట్యూబ్ లో కొత్త రికార్డును సృష్టించిన మహేష్ బాబు

Published on Jan 2, 2014 7:38 PM IST

1_Nenokkadine_New_Poster (5)
‘1- నేనొక్కడినే’ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి ఆదరణను పొందుతుంది. దాదాపు 24 గంటలలో 5 లక్షలమంది వీక్షకులు ఈ వీడియోను చూసి కొత్త రికార్డును నెలకొల్పారు. ఈ వీడియోలో వున్న యాక్షన్ సీన్ లను, హాలీవుడ్ స్థాయి టేకింగ్ ను చూసి అభిమానులు చాలా ఆనందంగా వున్నారు. ఈ సినిమా జనవరి 10న మనముందుకు రానుంది.

ప్రస్తుతం మహేష్ బాబు కుటుంబంతో సహా చిన్న ట్రిప్ కు వెళ్ళాడు. ఆగడు సినిమాకోసం కొన్ని రోజుల షూటింగ్ తరువాత కొత్త సంవత్సరాన్ని ఇంట్లోనే జరుపుకుని ఆ సందర్భంగా ఈ ట్రిప్ కు వెళ్ళాడు “కుటుంబంతో పాటూ చిన్న హాలీడే:) అతిత్వరలో తిరిగొస్తా” అని ట్వీట్ చేశాడు

సుకుమార్ ఈ సినిమాకు దర్శకుడు. కృతిసనన్ హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు

CLICK HERE FOR VIDEO

తాజా వార్తలు