జనవరిలో టి.విలలో ప్రసారం కానున్న అత్తారింటికి దారేది

జనవరిలో టి.విలలో ప్రసారం కానున్న అత్తారింటికి దారేది

Published on Dec 17, 2013 7:00 PM IST

AD
తాజా కధనాల ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ ‘అత్తారింటికి దారేది’ సినిమా జనవరి 11న టి.వి లో ప్రసారం కానుంది. ఈ సినిమా హక్కులను తెలుగు సినీ చరిత్రలోనే అధికమొత్తం పెట్టి మా టి.వి సొంతం చేసుకున్న విషయం తెలిసినదే.

ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. పవన్ సరసన సమంత, ప్రణీత నటించారు. దాదాపు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళను సాధించింది. ఇంత హంగామా జరుగుతున్న నేపధ్యంలో ఇలా టి.వి లలో ప్రసారం చెయ్యడం ఆశ్చర్యమే. ఇప్పటివరకూ ‘మగధీర’, ‘ఈగ’, ‘రోబో’ సినిమాలు అత్యధిక టి.ఆర్.పి చిత్రాలుగా రికార్డులలో నిలిచాయి

దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత

తాజా వార్తలు