అమ్మాయిలంటే పడని వాడు ప్రేమలో పడితే.!

అమ్మాయిలంటే పడని వాడు ప్రేమలో పడితే.!

Published on Dec 16, 2013 8:15 AM IST

naa_rakumarudu
చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాడు. అతన్ని చూస్తె ఏ అమ్మాయి అయినా ఇష్టపడుతుంది. కానీ అతనికి మాత్రం అమ్మాయిలంటే పడదు. అలాంటివాడు ప్రేమలో పడితే ఎలా ఉంటది అని మనకు చూపించబోయే చిత్రమే ‘నా రాకుమారుడు’. ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ఈ మూవీలో తన పాత్ర గురించి నవీన్ చంద్ర మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ పూర్తి మాస్ పాత్రల్లో కనిపించాను. ఈ సినిమాలో క్లాస్, మాస్ తో కూడిన లుక్ లో కనిపిస్తాను. ఇందులో నా పాత్రకి అస్సలు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు. కానీ అతను ఎలా ప్రేమలో పడ్డాడు అనేది ఆసక్తికరంగా ఉంటుందని’ అన్నాడు. సత్య దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ని వజ్రంగ్ నిర్మించగా అచ్చు సంగీతం అందించాడు.

తాజా వార్తలు