గుణ్ణం గంగరాజు తెరకెక్కిస్తున్న ‘చందమామలో అమృతం’ సినిమా ట్రైలర్ ని రేపు(డిసెంబర్ 17న) రిలీజ్ చేయనున్నారు. ఆగష్టులో ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకోవడంతో ఈ చిత్ర టీం ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి నిర్ణయం తీసుకుంది.
స్పేస్ కాన్సెప్ట్ పై తీస్తున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమా ఇదే. అలాగే ఈ చిత్రంలోని పాత్రలను ఫేమస్ అమృతం సీరియల్ నుంచి తీసుకున్నారు. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ, హరీష్ కోయలగుండ్ల, శివనారాయణ, వాసు ప్రధాన పాత్రలు పోషించారు. మారుత విలాస్ స్థాపించిన అమృతం పాత్రలో శ్రీనివాస్ అవసరాల కనిపించనుండగా, అమృతం పార్టనర్ అయిన అంజి పాత్రలో హరీష్ కనిపించనున్నాడు.
ఈ సినిమాలో ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయి. గుణ్ణం గంగరాజు మరియు అతని టీం సినిమా బాగా రియలిస్టిక్ గా ఉండాలని స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సినిమాలో కొంత భాగం చంద్రుడిపై ఉంటుంది. అది సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు. శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.