‘మిధునం’ సినిమా చుసిన విలక్షణ దర్శకుడు కె. బాలచందర్ తనికెళ్ళ భరణిని అమితంగా పొగిడేశారు. తనికెళ్ళ భరణి డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘మిధునం’ గత సంవత్సరం విడుదలై విమర్శకుల ప్రశంశలను అందుకుంది.
ఒక వారం క్రితం కె. బాలచందర్ తనికెళ్ళ భరణి పిలిచి యు ట్యూబ్ లో సినిమా కొంత చూసాను, చాలా బాగుందని అన్నారు. తనికెళ్ళ భరణి ఆయనకి డివిడి పంపడంతో పూర్తిగా చూసారు. చుసిన తర్వాత ‘సినిమాని బాగా ఎంజాయ్ చేసానని, ఓ కవితని తెరపై ఆవిష్కరిస్తే ఎంత బాగా ఉంటుందో అలా సినిమా ఉందని’ చెప్పి భరణిని మెచ్చుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్నా చెన్నై ఫిలిం ఫెస్టివల్ లో మిధునం సినిమాని ఇండియన్ పోనోరమ సెక్షన్ లో ప్రదర్శించారు.
ఎస్.పి బాలసుబ్రమణ్యం – లక్ష్మి ప్రాధాన్ పాత్రలు పోషించిన ఈ సినిమాలో వయసు మళ్ళిన జంట మధ్య ఉండే ప్రేమాను బంధాలను చూపించారు.