సుసేన్ నుండి విడిపొనున్న హృతిక్

సుసేన్ నుండి విడిపొనున్న హృతిక్

Published on Dec 13, 2013 11:00 PM IST

Hrithik-Roshan-with-his-wif
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన భార్య సుసేన్ తో విడిపోనున్నాడు. ఈ జంట పెళ్ళికముందు నాలుగేళ్ళు డేటింగ్ చేసి 13 ఏళ్ళ వివాహ జీవితం గడిపారు. ఈ ఇద్దరి ప్రముఖుల మధ్యా అంత సఖ్యత లేదని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయ్. ఇప్పుడు మేము వీరు విడిపోయామనే వార్తను దృవీకరించారు.

అతను ఇచ్చిన ప్రెస్ నోట్ ను బట్టి “సుసేన్ నాతొ గడుపుతున్న 17ఏళ్ళ జీవితాన్ని ఇంక ముగించుకోవాలని కోరుకుంది. ఇది నాకు, నా కుటుంబానికి మీడియా నుంచి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అని కోరుకునే కాలం. నాకు వివాహ వ్యవస్థ పై నమ్మకం వుంది. ఈ వార్త విని నా అభిమానులు నిరాశ చెందోద్దు అని కోరుకుంటున్నా” అని తెలిపాడు

హృతిక్ కి ఇద్దరు కొడుకులు. హీరాన్, హ్రిదాన్. ప్రస్తుతం తరుచుగా తలనొప్పుల నుండి బయటకువచ్చే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. హృతిక్ నటించిన ‘క్రిష్ 3’ భారీ విజయం సాధించింది

తాజా వార్తలు