మొదలైన నాగ చైతన్య కొత్త మూవీ

మొదలైన నాగ చైతన్య కొత్త మూవీ

Published on Dec 12, 2013 11:40 AM IST

naga-chaitanya-and-konda-vijay-kumar
ఈ సంవత్సరం ‘తడాఖా’ సినిమాతో హిట్ అందుకున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం మనం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో విజయాన్ని అందుకున్న డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి సబందించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగాయి. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 23నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.

అలాగే ఈ సినిమాకి ‘ఒక లైలా కోసం’ అనే టైటిల్ ఖరారు చేసారు అని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాకి ఇంకా ఎలాంటి టైటిల్ ని ఖరారు చేయలేదని ఈ చిత్ర టీం తెలిపింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమాని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నాడు. ఇది కాకుండా నాగ చైతన్య నటించిన ‘ఆటోనగర్ సూర్య’ త్వరలో విడుదల కావడానికి సిద్దమవుతోంది.

తాజా వార్తలు