ఎఎన్ఆర్ మంచి గాయకుడు – పి. సుశీల

ఎఎన్ఆర్ మంచి గాయకుడు – పి. సుశీల

Published on Dec 10, 2013 8:10 AM IST

sushila
సంగీత ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. లెజెండ్రీ గాయని అయిన పి. సుశీల గారి పేరు మీద ఓ ట్రస్ట్ ని ప్రారంభించి స్వయంగా సుశీల గారే సంగీతంలో ఎన్నో సేవలందించిన వారిని గుర్తించి వారిని ప్రతి సంవత్సరం సత్కరిస్తున్నారు. ఈ సంవత్సరం ఆమె ఆ సత్కారాన్నికి అక్కినేని నాగేశ్వరరావుకి అందిద్దాం అనుకున్నారు కానీ ఆయన కాస్త అస్వస్థతో ఉండడం వల్ల ఈ సంవత్సరం ఆ పురష్కారాన్ని వాణీజయరాంకి అందించారు. ఈ కార్యక్రమం నిన్న జరిగింది.

ఈ వేడుకలో పి. సుశీల మాట్లాడుతూ ‘ గత ఇదేల్లుగా ఈ పురష్కారాన్ని అందజేస్తున్నాను. ఈ సంవత్సరం ఈ పురష్కారాన్ని అక్కినేని గారికి ఇవ్వాలనుకున్నాను. మీకందరికీ తెలియని సిశయం ఏమిటంటే ఎఎన్ఆర్ మంచి గాయకుడు. కానీ ఈ సంవత్సరం ఆయన అస్వస్థతో ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని ఆయనకి అంకిత మిస్తున్నానని’ తెలిపింది.

తాజా వార్తలు