బాలీవుడ్ లో ఒక ఊపు ఉపేసిన సన్నీ లియోన్ దృష్టి ప్రస్తుతం టాలీవుడ్ పై పడింది. గత యేడాది బాలీవుడ్ లోకి ప్రవేశించిన ఈ భామ ఈ మధ్యే ‘జీస్మ్ 2’తో హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘రాగిణి ఎం.ఎం.ఎస్ 2’, ‘జాక్ పాట్’, ‘టీనా అండ్ లోలో’ సినిమాలు వున్నాయి. ఇప్పుడు ఈ వయ్యారిని త్వరలో టాలీవుడ్ లో సైతం చూడనున్నాం.
ఒక ప్రచార వేడుకకు వచ్చిన సన్నీ ఆమె ఒక తెలుగు సినిమాకు ఐటెమ్ సాంగ్ లో చిందేయనుందని తెలిపింది. సినిమా పేరు బయటకు చెప్పకపోయినా అది భారీ బడ్జెట్ చిత్రమని చెప్పింది. ఆమెను ప్రధానపాత్రలో నటించమని కొంతమంది తెలుగు బృందాలు ఆశ్రయించారట. అంతా సమంగా జరిగితే 2014లో తెలుగు సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తుందట ఈ భామ. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతారు.
ఇటీవలే ‘వడా కర్రీ’ అనే తమిళ సినిమాలో ఐటెమ్ సాంగ్ చెయ్యడానికి అంగీకరించింది. సచిన్ జోషి, నసీరుద్ధీన్ షాహ్ నటించిన ‘జాక్ పాట్’ సినిమా ఈ నెలలో విడుదలకానుంది.