జపాన్ వెళ్తున్న సమంత

జపాన్ వెళ్తున్న సమంత

Published on Dec 9, 2013 11:13 PM IST

samantha

ప్రస్తుతం సమంత ధ్యాసంతా పనిమీదే వున్నట్టు వుంది. ఆమెకు అనారోగ్యం అన్న పుకార్ల తరువాత పని ప్రారంభించిన ఈ భామ అప్పట్నుంచి తీరిక లేకుండా పనిచేస్తూనే వుంది. ఎన్.టీ.ఆర్ తో ‘రభస’ సినిమా హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకోగానే సమంత వి.వి వినాయక్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ కోసం జపాన్ వెళ్తుంది

సమంత, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లపై ఒక పాటను తెరకెక్కించనున్నారు. సమంత కు జపాన్ అన్నా అక్కడి ప్రజలన్నా చాలా ఇష్టం. “జపాన్ కు వెళ్తున్నా. సోమవారం ప్రపంచంలోనే నాకు చాలా ఇష్టమైన జపనీస్ ను చూడనున్నా” అని ట్వీట్ చేసింది
ఈ రొమాంటిక్ ఎంటెర్టైనర్ ను బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. వచ్చే యేడాది ఈ సినిమా మన ముందుకు రానుంది.

తాజా వార్తలు