‘సెకండ్ హ్యాండ్’ కి ‘యు/ఏ’ సర్టిఫికేట్

‘సెకండ్ హ్యాండ్’ కి ‘యు/ఏ’ సర్టిఫికేట్

Published on Dec 9, 2013 3:30 PM IST

Second-Hand
నూతన తారలతో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సెకండ్ హ్యాండ్’. ఆసక్తికరమైన ప్రోమోస్ మరియు కొత్తగా పబ్లిసిటీ చేయడం వల్ల ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఈ శుక్రవారం అనగా డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు.

ధన్య బాలకృష్ణ, కిరీటి, సుదీర్ వర్మ మరియు విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా కిషోర్ తిరుమల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పూర్ణ నాయుడు – బివిఎస్ రవి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రస్తుతం యువత ఎలా ఉన్నారు, ఎలాంటి రిలేషన్స్ ఫాలో అవుతున్నారని చూపించనున్నారు. రవి చంద్ర ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

తాజా వార్తలు