మిస్టర్ నోకియా కోసం పాటలు రాసిన మనోజ్

మిస్టర్ నోకియా కోసం పాటలు రాసిన మనోజ్

Published on Jan 4, 2012 9:40 AM IST


మంచు మనోజ్ కుమార్ మంచి టాలెంట్ ఉన్న నటుడు మరియు విలక్షణమైన నటుడు అని ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఆయన చిత్రాలలో ఫైట్స్ డూప్ లేకుండా రిస్క్ తీస్కోని ఎలాంటి వైర్ వర్క్ లేకుండా చేస్తారు. ఇవే కాకుండా ఇప్పుడు మనోజ్ పాటల రచయితగా కూడా మారారు. ఆయన తాజాగా నటిస్తున్న మిస్టర్ నోకియా చిత్రంకోసం రెండు పాటలకు సాహిత్యం సమకూర్చారు.

అందులో ఒకటి ‘ఎవడే నిన్ను కన్న పిస్తా’ మరొకటి ‘దొరికితే కోటింగ్ ఇస్తా’ పాటలకు సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఆడియో సంక్రాంతికి విడుదలవుతుంది. మిస్టర్ నోకియాలో హీరోయిన్స్ గా సనాఖాన్ మరియు కృతికర్భందా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డి.ఎస్ రావు నిర్మిస్తుండగా అనిల్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి నెలాఖరులో విడుదల చేయడానికి సనాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు