కొత్త స్టొరీతో లక్ పరీక్షించుకోనున్న ప్రభుదేవా

కొత్త స్టొరీతో లక్ పరీక్షించుకోనున్న ప్రభుదేవా

Published on Dec 6, 2013 8:45 AM IST

Prabhu-Deva
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా మారి ఇప్పుడు డైరెక్టర్ గా వరుస విజయాలు అందుకుంటున్న ప్రభుదేవా సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. బాలీవుడ్ లో ప్రభుదేవా డైరెక్టర్ గా చేసిన సినిమాల లిస్టు ఓ సారి చూసుకుంటే దాదాపు అన్ని సినిమాలు రీమేక్ లే ఉంటాయి.

కానీ మొదటిసారి ప్రభుదేవా రీమేక్ కాకుండా ఒరిజినల్ స్క్రిప్ట్ తో తీసిన సినిమా ఆర్ రాజ్ కుమార్. షాహిద్ కపూర్, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు రీమేక్ లతో సక్సెస్ లు అందుకున్న ప్రభుదేవా ఒరిజినల్ స్టొరీతో బాలీవుడ్ లో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. లాగే ఒరిజినల్ స్టొరీ ప్రభుదేవాకి కలిసొస్తుందో లేదో కూడా చూడాలి..

తాజా వార్తలు