సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్య నటించనున్న సినిమా డిసెంబర్ 12నుండి మొదలుకానుంది. ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నారు.
ఈ యేడాది మొదట్లో విజయ్ కుమార్ కొండా నితిన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘గుండేజారి గల్లంతయ్యిందే’ సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఆ తరువాత నుండి వరుసగా అయిదు నెలలపాటూ చైతన్య తో ప్రీ ప్రొడక్షన్ పనులు చేపట్టాడు. ఇదివరకటి మిస్ యూనివర్స్ పూజా హెగ్డే మొదటిసారిగా టాలీవుడ్ లో చైతూ పక్కన నటించనుంది.
ప్రస్తుతం చైతన్య నాగేశ్వరరావు, నాగార్జున, శ్రేయ, సమంత తదితరులు నటిస్తున్న విక్రమ్ కుమార్ ‘మనం’ షూటింగ్ జరుగుతుంది. మరోపక్క ‘ఆటోనగర్ సూర్య’ త్వరలో మనముందుకు రానుంది.