జెండాపై కపిరాజు జనవరిలో రానుందా?

జెండాపై కపిరాజు జనవరిలో రానుందా?

Published on Dec 5, 2013 2:55 PM IST

Janda-Pai-Kapiraju-new-phot
యంగ్ హీరో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న జెండాపై కపిరాజు సినిమా షూటింగ్ పూర్తయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని జనవరి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వారం రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో పూర్తయ్యింది. నాని సరసన అమలా పాల్ హీరోయిన్ గా కనిపించనుంది.

శరత్ కుమార్ ఈ సినిమాలో సిబిఐ ఆఫీసర్ గా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో మయ కన్నన్ అనే ఓ తమిళియన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ పాత్ర సినిమాకి హైలైట్ అవుతుందని అంటున్నారు. నాని ఈ పాత్ర కోసం ఏకంగా గుండు కొట్టుకొని తన లుక్ ని పూర్తిగా మార్చుకున్నాడు.

రాగిణి ద్వివేది, శివ బాలాజీ, వెన్నెల కిషోర్, ధనరాజ్, ఆహుతి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వాసన్ విజువల్ వెంచర్స్ బ్యానర్ పై కెఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు