డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 3డి సినిమా ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో మళయాళ కుట్టి నిత్యా మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది. కాస్త గ్యాప్ ఇచ్చిన నిత్యా మీనన్ ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని కుంతల వాటర్ ఫాల్స్ దగ్గర జరుగుతున్న షూట్ లో పాల్గొంది.
ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలోని ఓ పాటని అనుష్క- రానా లపై కుంతల వాటర్ ఫాల్ వద్ద షూట్ చేసారు. తాజాగా అక్కడి లోకల్ దినపత్రికతో గుణశేఖర్ మాట్లాడుతూ ‘ మన లోకల్ లో ఇంతమంచి ప్లేస్ ఉందని ఊహించలేదు. ఇక్కడ కొన్ని సౌకర్యాలను కల్పించాలి. అలాగే ఇక్కడ షూటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉందని’ అన్నాడు.
నిత్యా మీనన్ ప్రస్తుతం ఈ సినిమా కాకుండా మాలిని 22 సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే చేరన్ దర్శకత్వంలో ‘ఏమిటో ఈ మాయ’ సినిమాలో కూడా నటిస్తోంది.