యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – కందిరీగ ఫేం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. మేము విన్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి 28న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఇదే రోజున ఎన్.టి.ఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆది’ సినిమా రిలీజ్ అయ్యింది.
సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘రభస’ అనేది వర్కింగ్ టైటిల్. కానీ ఇది ఫైనల్ టైటిల్ కాదు. ఈ సినిమాకి ఫైనల్ టైటిల్ మారే అవకాశం ఉంది. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్నాడు.