వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేశ్ మరియు మేలినే కన్నొకద ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘డీ ఫర్ దోపిడీ’. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూస్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు.
ఈ సినిమా ద్వారా సిరాజ్ కల్ల దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కొంతమంది ఫ్రెండ్స్ ఒక బ్యాంకుని దోచుకోవాలనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. రాజ్ – డికె నిర్మించిన ఈ సినిమాకి హీరో నాని సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అలాగే నాని ఈ సినిమాకి వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాడు. మహేష్ శంకర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.