యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘బాహుబలి’. సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ప్రస్తుతం కేరళలో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ నేటితో ముగియనుంది. త్వరలోనే ఈ చిత్ర టీం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
బాహుబలి సినిమాని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నడు లేనంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2015 లో పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చాలా మంది ఫేమస్ అయిన సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్.